ఈ అవ్వను ఆదుకోండి

80చూసినవారు
ఈ అవ్వను ఆదుకోండి
కాగజ్‌నగర్‌ పట్టణంలోని తీరందాస్ థియేటర్ సమీపంలో రోడ్డు పక్కన చెత్త కుప్పలో తీవ్ర దుర్గంధం మధ్య ముసలి అవ్వ గత కొన్ని రోజులుగా పడి ఉంది. ఈ దారి గుండా వచ్చి పోయే వారు చూస్తున్నారే తప్ప ఎలాంటి సహాయం చేయడం లేదు. తీవ్ర దుర్గంధం మధ్య దిక్కులేని స్థితిలో పడి ఉంది. ప్రభుత్వ, పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి, ఈ అవ్వకు వైద్య సహాయం అందించి ఏదైనా అనాధ ఆశ్రమంలో చేర్పించాలని పలువురు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్