మీరు వెళ్ళొద్దు సార్ అంటూ విలపిస్తున్న పిల్లలు

81చూసినవారు
మీరు వెళ్లొద్దు సార్ అంటూ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు విలపిస్తున్నారు. కాగజ్‌నగర్‌ మండలం చింతగూడ ఎంపీపీఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ లక్ష్మినారాయణ‌ బదిలీపై వెళ్తున్నారని తెలియడంతో మంగళవారం మీరు వెళ్లొద్దు సార్ అంటూ ఏడుస్తు గేటుకు ఆడ్డంగా విద్యార్థులు కూర్చున్నారు. హెఎం లక్ష్మీనారాయణ పాఠశాల అభివృద్దికి, పిల్లల స్ట్రెంత్ గణనీయంగా పెరగడంలో ఎంతో కృషి చేశారని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్