కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ ఫాంలో సౌకర్యాల కరువు

56చూసినవారు
కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ ఫాంలో సౌకర్యాల కరువు
కాగజ్‌నగర్‌ పట్టణంలో రైల్వే స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన మూడో ప్లాట్ ఫారం అసౌకర్యాలతో ఉందని డివైఎఫ్ఐ కొమురంభీం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గెడం టీకనంద్, గొడిసెల కార్తీక్ ఆరోపిస్తున్నారు. మంగళవారం రైల్వే ప్లాట్ ఫాంను వారు పరిశీలించి మాట్లాడారు. ప్రయాణికులు ఎండలో పడిగాపులు కాయాల్సి వస్తోందని అన్నారు. రైల్వే అధికారులు సిబ్బంది వెంటనే స్పందించి అదనంగా షెడ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్