Nov 05, 2024, 12:11 IST/
ఢిల్లీలో రెచ్చిపోయిన గ్యాంగ్స్టర్లు (వీడియో)
Nov 05, 2024, 12:11 IST
దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు గ్యాంగ్స్టర్లు రెచ్చిపోయారు. వెస్ట్ ఢిల్లీలోని ఓ షోరూమ్‌లోకి ప్రవేశించి గాల్లోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం భారీగా నగదు డిమాండ్ చేసిన ఒక నోట్‌ను విడిచిపెట్టి వెళ్లారు. జితేంద్ర గోగి గ్యాంగ్‌కు చెందిన షూటర్లు షోరూమ్‌పై కాల్పులు జరిపారు. తమకు రూ.10 కోట్లు ఇవ్వాలి అంటూ ఓ బెదిరింపు లేఖను షోరూమ్ వద్ద వదిలిపెట్టి వెళ్లారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.