మయొనైజ్‌ని సరైన పద్ధతుల్లో తయారు చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుండడంతో తాజాగా దీన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో మయొనైజ్‌కి ప్రత్యామ్నాయాలను నిపుణులు సూచిస్తున్నారు. అవకాడో గుజ్జు.. శెనగలు, వెల్లుల్లి, తెల్ల నువ్వుల పొడితో చేసే క్రీమ్ వాడుకోవచ్చు. పైన్ నట్స్, చీజ్, ఆలివ్ నూనెతో చేసే క్రీమ్.. గ్రీక్ యోగర్డ్, పీనట్ బటర్ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి రుచితో పాటు ఆరోగ్యకరం కూడా.