ఏపీలోని ఎమ్మెల్సీ ఓటర్ల రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పట్టభద్ర ఓటర్ల నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నమోదు ప్రక్రియ రేపటితో ముగియనుంది. అర్హత గల గ్రాడ్యుయేట్లు AP CEO వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఫారం-18 నింపి, గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ఎమ్మార్వో ఆఫీసులో సబ్మిట్ చేయవచ్చు.