కొత్తగూడెం: కరెంట్ షాక్తో మహిళ మృతి
హీటర్ పెడుతుండగా కరెంట్ షాక్తో మహిళ మృతి చెందిన ఘటన పినపాకలో శనివారం చోటుచేసుకుంది. పినపాక మండలం అమరారం పంచాయతీలోని జిన్నలగూడెంలో బొజ్జ రజిత (26) నీళ్లు వేడి చేయడానికి హీటర్ పెడుతున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలున్నారు. బయ్యారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.