భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం మండలంలో అనారోగ్యంతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న బెక్కంటి శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎంపీడీవో మృతి పట్ల పలువురు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.