జిల్లాలో నిరుపేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లను తక్షణమే పంపిణీ చేయాలని సేవ్ కొత్తగూడెం కన్వీనర్ జలాల్ కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారులతో సోమవారం ఆందోళన చేపట్టారు. ఎవరి కుట్టు మిషన్లు వారికే ఇచ్చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతిపత్రం సమర్పించారు. 8 నెలల కాలం గడుస్తున్న పట్టించుకోవడంలేదన్నారు. నిల్వ ఉన్న కుట్టు మిషన్లను పంపిణీ చేయకపోతే కార్యాలయాల ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.