లక్ష్మిదేవిపల్లి: రేగళ్ల సాగు భూముల సమస్యలను పరిష్కరించాలి

62చూసినవారు
లక్ష్మిదేవిపల్లి: రేగళ్ల సాగు భూముల సమస్యలను పరిష్కరించాలి
లక్ష్మిదేవిపల్లి మండలం రేగళ్ల పంచాయితీలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దశాబ్దాలుగా వేధిస్తున్న సాగు భూముల పట్టా హక్కు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. అటవీ, రెవెన్యూ భూముల సమస్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగ సీతరాములు, చౌదరి, అర్జున్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్