ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం, ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం సమావేశమయ్యారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు కలిపించాలి అని వారు డిమాండ్ చేసారు. డిగ్రీ విద్యార్థులకు తెలుగు అకాడమిక్ బుక్స్ సకాలంలో ఇవ్వాలి అని అన్నారు. డిగ్రీ కళాశాలల్లో మంచినీరు, వాష్రూమ్స్ సదుపాయం కల్పించాలని కోరారు. గత మూడేళ్లుగా అందాల్సిన స్కాలర్షిప్ లు ఇవ్వాలని చెప్పారు.