పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం ఇల్లందులో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేసిందని ఎమ్మెల్యే అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.