ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం టేకులపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇస్లావత్ రెడ్యా నాయక్ చిన్నమ్మ (పిన్ని) ఇస్లావత్ లక్ష్మీ మృతి చెందడం జరిగింది. విషయం తెలిసి సోమవారం కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ భూక్యా రాంచంద్ర నాయక్ వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 100 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఇస్లావత్ రెడ్యా నాయక్, ఇస్లావత్ సాయి నాయక్, సదానందం, బాబురావు తదితరులు పాల్గొన్నారు.