సురక్షితంగా బయటపడ్డ 75 మంది భారతీయులు
సిరియాను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకోవడంతో అధికారంలో ఉన్న బషర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉంటున్న 75 మంది భారతీయులు సిరియాను వీడి లెబనాన్ చేరుకున్నారు. అనంతరం వారంతా వాణిజ్య విమానాల్లో స్వదేశం చేరుకోనున్నారని భారత విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. విదేశాంగశాఖ తరలించిన వారిలో 44 మంది జమ్మూకశ్మీర్‌కు చెందినవారని సమాచారం.