సింగపూర్ నాలుగో ప్రధానిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా.. లారెన్స్ వాంగ్ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. వీళ్లిద్దరూ పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన వారు. అయితే లూంగ్ ప్రభుత్వంలోని మంత్రులు అందరూ వాంగ్ సర్కారులోనూ అవే పదవులను చేపట్టనున్నారు.