TG: సంగారెడ్డి జిల్లాలోని రాయికోడ్ మండలం మాటూరు గ్రామ శివారులో గోదావరి గంగా ఆగ్రో ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (చక్కెర కార్మాగారం)ను ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. చెరుకు రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు పూర్వవైభవం తీసుకొస్తమని, వారి మేలు కోసమే ఎన్సీఈఆర్టీ నిబంధనలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.