బెంగళూరులో అర్చన (35) అనే యోగా టీచర్ బ్రీత్ కంట్రోల్ ప్రతిభతో చావు నుంచి తప్పించుకుంది. అర్చనతో తన భర్తకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో బిందు అనే మహిళ ఆమెను హతమార్చేందుకు సుపారీ ఇచ్చింది. దీంతో దుండగులు ఆమెను తీవ్రంగా కొట్టి అడవికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అర్చన తన యోగా ప్రతిభతో శ్వాసను నియంత్రించుకుని చనిపోయినట్లు నటించడంతో దుండగులు వదిలేసి పారిపోయారు. ఈ మేరకు అర్చన పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్టు చేశారు.