మానవాళిని ఇప్పుడు వేధిస్తున్న పలు వైరస్‌లతోపాటు, భవిష్యత్తులో తలెత్తే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు సింగిల్ షాట్.. 'లైఫ్ టైమ్' వ్యాక్సిన్ తయారీపై సైంటిస్టుల పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. ‘ఒరేగావ్ హెల్త్, సైన్స్ యూనివర్సిటీ’ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న ఈ టీకాను.. ఒకసారి తీసుకోవటం ద్వారా జీవితకాలం ‘ఇన్‌ఫ్లూయెంజా వైరస్’ల నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. త్వరలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సమాచారం.