ఇటీవలి కాలంలో చిన్నారులపై వీధికుక్కల దాడులు అధికమయ్యాయి. తాజాగా మరో దాడి చేసుకుంది. తెలంగాణలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మైసమ్మ వీధిలో చిన్నారి హరినేత్రపై వీధికుక్క దాడి చేసింది. కిరాణం షాపులో బిస్కెట్లు కొనుక్కొని ఇంటికి వెళ్తున్న క్రమంలో వీధికుక్క ఆమెపై దాడి చేసి చెంప, పదవిపై కరిచింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.