స్టాక్‌ మార్కెట్‌లో రూ.35 లక్షల నష్టం.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

71చూసినవారు
స్టాక్‌ మార్కెట్‌లో రూ.35 లక్షల నష్టం.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
TG: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన మొత్తం నష్టపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్‌(35) ఇంటిని తాకట్టు పెట్టి మొత్తం రూ.35 లక్షలు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు. అయితే ఆ మొత్తం నష్టపోవడంతో మనస్తాపం చెంది ఈ నెల 9న పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్