ఈ ఏడాది మహాశివరాత్రి కొన్ని రాశుల వారికి అదృష్టంగా మారనున్నట్లు వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 18న మహాశివరాత్రి శని, సూర్య గ్రహాల ప్రభావం దాదాపు అన్ని రాశులపైనా కనిపిస్తోంది. అయితే, మేష రాశి వారు శంకరుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొంది వ్యాపారం, ఉద్యోగం, వైవాహిక జీవితంలో ఒత్తిడులు తొలగుతాయని పేర్కొంటున్నారు. వృషభ రాశి వారు పంచామృతాలతో శివున్ని అభిషేకిస్తే అదృష్టం వరిస్తుందంటున్నారు. అలాగే కుంభ రాశి వారు ఆ రోజు శివున్ని భక్తితో పూజిస్తే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.