మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ ఆదేశాల మేరకు శనివారం బీసీ కులగణనపై మేధావులు, బిసి కుల సంఘాల నాయకులు నిర్వహించిన సమావేశంకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుంటుంబ సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2023 నవంబర్ 10న రాహుల్ గాంధీ కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని అన్నారు.