గణతంత్ర వేడుకలు.. ఢిల్లీలో డ్రోన్ల కార్యకలాపాలపై నిషేధం
జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో డ్రోన్ల కార్యకలాపాలపై ఢిల్లీ పోలీసులు నిషేధం విధించారు. జనవరి 18వ తేదీ నుంచి వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.