ఆర్బీఐ తాజాగా బ్యాంక్ ఖాతాలపై కీలక ప్రకటన చేసింది. యాక్టివ్ లో ఉన్న అన్ని రకాల ఖాతాలకు, లాకర్లకు ఇకపై తప్పనిసరిగా నామినీలను చేర్చాలని బ్యాంకులను ఆదేశించింది. ఇప్పటికే అకౌంట్ ఉన్నవారికి, కొత్తగా ఖాతా ఓపెన్ చేసే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. బ్యాంకులు ఖాతాలకు కచ్చితంగా నామినీలను జోడించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. లెక్కకు మించి బ్యాంకు ఖాతాలకు నామినీలు లేరని దీని వల్ల ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపింది.