ఏపీకి విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన అమిత్ షా.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి నేతలు ఆయనకు స్వాగతం పలికారు. చంద్రబాబు విందుకు డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కూటమి నేతలు హాజరయ్యారు.