అమిత్ షాకు ఘనంగా సన్మానం చేయనున్న కూటమి నేతలు

59చూసినవారు
అమిత్ షాకు ఘనంగా సన్మానం చేయనున్న కూటమి నేతలు
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,440 కోట్లు కేంద్రం ప్రకటించినందున కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఏపీ కూటమి నేతలు ఘనంగా సన్మానించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు, విభజన హామీలు అమిత్ షా.. సీఎం చంద్రబాబు మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రికి విజయవాడలోని ప్రైవేట్ హోటల్‌లో అమిత్ షా బస చేయనున్నారు. ఆదివారం గన్నవరంలోని ఎన్డీఆర్ఎఫ్‌ వేడుకల్లో అమిత్ షా, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్