
SLBC టన్నెల్లో కొనసాగుతోన్న సహాయక చర్యలు
TG: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఆపరేషన్ మార్కోస్ (ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్) టన్నెల్ రంగంలోకి దిగుతోంది. ఈ కమాండ్స్ నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ కార్యక్రమాలు చేపడతారు. ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో కార్మికులు బయటకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఈరోజైనా బాధితుల ఆచూకీ తెలుస్తుంది భావిస్తున్నారు.