బాలీవుడ్ నటుడు గోవింద తన భార్య సునీత అహుజాతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా గోవింద మేనేజర్ స్పందించారు. 'కుటుంబంలోని కొంతమంది చేసిన కామెంట్స్ కారణంగా ఈ వార్తలు ప్రచారమవుతున్నాయి. వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి. కానీ, అవి విడాకులు తీసుకునేంత పెద్దవి కావు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు' అని తెలిపారు. విడాకుల వార్తలు అవాస్తవమని గోవిందా మేనకోడలు ఆర్తి స్పష్టం చేశారు.