ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కుటుంబ సర్వే పేరుతో ప్రభుత్వం డ్రామాలకు తెరలేపిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం ఎంపి మాట్లాడుతూ. బీసీలను మోసంచేయడానికే సర్వే అని, రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ కులగణన చేపట్టిందని, కులగణనలో వ్యక్తిగత నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నావళి రూపొందించారన్నారు. ప్రజల ఆస్తులు, అప్పులు, భూములు, ఎవరు ఏరాజకీయ పార్టీ అనే వివరాలు సేకరించడం ఎందుకో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమే డిమాండ్ చేశారు.