సీఎం సొంత నియోజకవర్గంలో కలెక్టర్, అధికారులపై దాడులు ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుందని, ఇంత జరుగుతుంటే ఇంటలిజెన్స్ ఏం చేస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం జరిగిన లగచర్ల ఘటనపై ఎంపి స్పందించారు. వికారాబాద్ లో మంగళవారం ఆమే మాట్లాడుతూ. ఈ ఘటనపై ప్రభుత్వ నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ విషయంలో సీఎం సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఎంపి అరుణ అభిప్రాయపడ్డారు.