మహబూబ్ నగర్ అర్బన్ మండలం - Mahabubnagar Urban Mandal

పాలమూర్ పురుపోరులో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ

పాలమూర్ పురుపోరులో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ

తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి చాలా ప్రత్యేకత ఉంది. 1952 సంవత్సరంలోనే మూడో గ్రేడు మున్సిపాలిటీగా ఏర్పడింది. 1959లోనే గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అర్హత సాధించింది. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 2004లో మహబూబ్ నగర్ మున్సిపాలిటీని ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీ జాబితాలో చేర్చింది. తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా కేంద్రంగా మహబూబ్ నగర్ తెరకెక్కింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,22,573 జనాభా ఉంది. ఈ జనాభా 2014లో 2,35,000 చేరింది. మహబూబ్ నగర్ చుట్టు పక్కన ఉన్న 10 గ్రామ పంచాయతీలను ఈ మున్సిపాలిటీలో కలిశారు. దీంతో ఈ మున్సిపాలిటీ విస్తీర్ణం మరింత పెరిగింది. 41 వార్డులు, 18 రెవెన్యూ వార్డులు కలిగిన అతిపెద్ద మున్సిపాలిటీ. ఈ పట్టణంలో పలు విద్యాసంస్థలు, వైద్య సంస్థలు సేవలందిస్తున్నాయి. మిషన్ భగీరథతో అమృత్ పథకం లింకు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని ప్రజలకు తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకాన్ని అనుసంధానం చేశారు. దీని కోసం రూ.163.36కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం 50శాతం, పట్టణ స్థానిక సంస్థలు 30శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20శాతం వాటా ధనంతో చేపట్టి తాగునీటి సరఫరాకు వెచ్చించారు. అభివృద్ధి కార్యక్రమాలకు రూ.24.12కోట్లు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో కళాభవనాలతోె పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రూ.24.12కోట్లు వెచ్చించారు. అంతేకాకుండా మున్సిపాలిటీ ప్రత్యేక గ్రాంట్ల కింద రూ.70కోట్లు పురపాలక, పరిపాలనశాఖ విడుదల చేసింది. ఈ గ్రాంటును రెండు దఫాలుగా విడుదల చేసింది. గ్రాంటు నుంచి డ్రైనేజీలు, సీసీ రోడ్లకు వెచ్చించింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.7.6కోట్లు పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కింద రూ.7.6కోట్లు వెచ్చించింది. స్వచ్ఛ్ భారత్, హరితహారం కార్యక్రమాలకు కూడా చేపట్టడం జరిగింది. పట్టణంలో 2లక్షల మొక్కలను నాటినట్లు తెలిసింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో గత ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్నది. ఛైర్మన్ మహిళలకు రిజర్వ్ కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఎంఐఎం పార్టీకి ఓటు బ్యాంకు బాగానే ఉన్నప్పటికీ ఆ పార్టీ ఛైర్మన్ స్థానానికి చాలా దూరంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఛైర్మన్ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ఛైర్మన్ టీఆర్ఎస్ పార్టీలో ఖాతాలోనే ఉందని చెప్పకతప్పదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోటీ జనవరిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్షపార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశాలున్నాయి. బీజేపీ, ఎంఐఎం పార్టీలకు ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కొన్ని సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. .

మహబూబ్‌నగర్ జిల్లా
Top 10 viral news 🔥
ప్రాణం పోతున్నా.. పట్టించుకోని జనం!
Oct 27, 2024, 01:10 IST/

ప్రాణం పోతున్నా.. పట్టించుకోని జనం!

Oct 27, 2024, 01:10 IST
ఓ యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. కొడుకును కాపాడుకునేందుకు అతడి తల్లి గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్దాం.. కాస్త సాయం చేయండని దారిన పోయే ప్రతి ఒక్కరినీ వేడుకున్నారు. కానీ ఎవరూ సాయం చేయలేదు. అంబులెన్స్ వచ్చేసరికి ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది. రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన కె.గంగాధర్ రావు (30) తల్లి గోవిందమ్మతో కలిసి ఆటోలో వెళ్తున్నాడు. గూడ్స్ షెడ్డు వంతెన దగ్గర పని ఉందని ఆటో దిగి ఒక్క అడుగు ముందుకు వేసేసరికి ట్రాక్టర్ ఢీకొట్టింది.