మక్తల్ మండలం సంగంబండ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన వాలీబాల్ క్రీడలను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కాసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు ఆడాలని, గెలుపోటములు సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.