ఒక్క ఏడాదిలో రూ.3 వేల కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. తెలంగాణలో రూ.759 కోట్లు, మహారాష్ట్రలో రూ.990 కోట్లు, ఉత్తరప్రదేశ్లో రూ.721 కోట్లు, తమిళనాడులో రూ.662 కోట్లు, గుజరాత్లో రూ.650 కోట్లు.. ఇలా రాష్ట్రాలవారీగా సైబర్ నేరగాళ్లు ఏడాది కాలంలో దేశంలో కొల్లగొట్టిన మొత్తం సొత్తు విలువ సుమారు రూ.3 వేల కోట్లకు పైనే. చివరికి ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లమని చెప్పి బెదిరించి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు.