నీట మునిగిన పంట పరిశీలన

622చూసినవారు
నీట మునిగిన పంట పరిశీలన
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మద్వార్ గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించారు వ్యవసాయ అధికారి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ. అధిక వర్షాల వల్ల పత్తి పంటలకు సోకే తెగుళ్ళ గురించి పత్తి పంటలు నీరు ఎక్కువగా నిలిచిన పరిస్థితులలో వేరు కుళ్లు తెగులు, ఎండు తెగులు సోకి మొక్కలు తలలు వాల్చి ఆకులు రంగు కోల్పోయి మొక్కలు ఎండిపోవును వర్షాలు తగ్గిన తర్వాత పొలంలో నీరు తీసివేసి వాడిపోయిన మొక్కలు, చుట్టూ పక్కన ఉన్న మొక్కలు అన్నిటికీ కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు ప్రతి లీటరు నీటికి కలిపి మొక్క వేరు భాగం తడిసేటట్లు పిచికారి చేసుకోవాలని గ్రామ రైతులకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్