నాగర్ కర్నూల్ జిల్లాలో హిజ్రాలు తమ సమస్యలను తీర్చాలని డిడబ్లుఓ అధికారిని రాజేశ్వరిని కలిసి వినతి పత్రం మంగళవారం అందించారు. మాకు ఆధార్ కార్డ్ లు లేవని ఇళ్ల స్థలాలు కూడా లేవని ఉపాధి లేక అడుక్కుని బతకాల్సి వస్తుందని హిజ్రాలు తెలిపారు. ప్రభుత్వం మా పై దయ ఉంచి ఉపాధి కల్పించి మౌలిక వసతులను కల్పించి ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం దయఉంచి మాకు న్యాయం చేయాలని కోరారు.