తెలంగాణలో పెట్టుబడులు.. మైత్రా, బ్లాక్‌స్టోన్ సంస్థల ఒప్పందం
దావోస్‌లో సీఎం రేవంత్‌తో మైత్రా గ్రూప్ డైరెక్టర్ గిరీష్ గెల్లి భేటీ అయ్యారు. ప్రభుత్వంతో రూ.7వేల కోట్లతో కంపెనీ ఎంవోయూ కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో సోలార్ సెల్స్, మాడ్యూల్స్ యూనిట్‌ను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుతో సుమారు 2500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే హైదరాబాద్‌లో రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో బ్లాక్‌స్టోన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.