భార్యను దారుణంగా చంపిన ఘటన.. కొనసాగుతున్న దర్యాప్తు

64చూసినవారు
భార్యను దారుణంగా చంపిన ఘటన.. కొనసాగుతున్న దర్యాప్తు
TG: మీర్‌పేట పీఎస్‌ పరిధి జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో జరిగిన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకట మాధవిని దారుణంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన సంగతి తెలిసిందే. ఫొరెన్సిక్‌ బృందం ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తోంది. కాగా ఈ ఘటనతో కాలనీలోని వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. హత్య జరిగిన ఇంటికి చుట్టుపక్కల ఉన్నవాళ్లలో కొందరు తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్