ఆర్జీవీకి బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష!

63చూసినవారు
ఆర్జీవీకి బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష!
చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను దోషిగా తేలుస్తూ ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసుపై గత ఏడేళ్లుగా విచారణ జరుగుతోంది. వర్మ కోర్టుకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ కోసం స్టాండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. మూడు నెలల్లోగా ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది.