ఇవాళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేశారు. నేజాతీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన ఒడిశాలో ఈ ఏడాది ఈ వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. ఆయన జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనను కటక్‌లో ఏర్పాటు చేశామన్నారు. నేతాజీ జయంతి పురస్కరించుకుని ఆయనకు వినమ్రతతో నివాళి అర్పిస్తున్నట్టు తెలిపారు.