ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ మరోసారి తన ప్రతిభతో మెప్పించారు. భారతదేశం యొక్క గొప్ప స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి, గౌరవించటానికి ప్రతి సంవత్సరం జనవరి 23న జరుపుకుంటారు. ఇవాళ ఆయన జయంతిని పురస్కరించుకుని పూరీ తీరంలో నేతాజీ సైకత శిల్పాన్ని చిత్రీకరించారు. గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఉన్న ఈ శిల్పం సందర్శకులను ఆకట్టుకుంటోంది.