నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి ప్రమాదశాత్తు కేఎల్ఐ కాల్వలో పడి గల్లంతయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన రాము ఆదివారం ఉదయం గ్రామం నుంచి బైక్పై గౌరారం వెళుతుండగా ప్రమాదవశాత్తు మంగనూరు గ్రామ శివారులో గల కేఎల్ఐ కాల్వలో పడిపోయాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బిజినేపల్లి ఎస్సై నాగ శేఖర రెడ్డి సోమవారం ఉదయం నుంచి కేఎల్ఐ కాలువలో ముమ్మరంగా గాలిస్తున్నారు.