నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రంలో యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. నేటి యువత సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు గంటలుగా వెతుకుతున్న యువకుని ఆనవాళ్లు లభించలేదు. వివరాలు తెలియాల్సి ఉంది.