పాల బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం

55చూసినవారు
పాల బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం
గత రెండు నెలలుగా పాల బిల్లులు రావడం లేదని పాడి రైతులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. గతంలో 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు వచ్చేదని, ఇప్పుడు కూడా ప్రభుత్వం అదేవిధంగా వచ్చేటట్లు చూడాలని ఎమ్మెల్యేను కోరారు. పెండింగ్ బిల్లులు రాకపోవడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దసరా పండుగ లోపు పెండింగ్ బిల్లులు వచ్చేలా ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్