ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. పద్మనాభసత్రం గ్రామానికి చెందిన శ్రావణి అనే యువతి వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు యువతిని గత నెల 24న హత్య చేసి, మృతదేహాన్ని
ఇంటి పక్కనే పూడ్చిపెట్టారు. అనంతరం యువతి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులే హత్యచేసి, డ్రామా ఆడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.