తిరుమల లడ్డు వివాదంపై మాజీ సీఎం
జగన్ ఇవాళ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. తిరుమలలో అనేక మంచి పనులు చేశామన్నారు. కేవలం ప్రజల మనస్సులను డైవర్ట్ చేసేందుకు, లడ్డు కాంట్రవర్సీ చేసేందుకు కూటమి ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీదకు తెచ్చే పనులు చేస్తున్నారని.. పీఎంకు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖలు రాస్తానంటూ
జగన్ మండిపడ్డారు.