భారాస ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు

569చూసినవారు
భారాస ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలోని మాధవస్వామి దేవాలయం చౌరస్తాలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కొల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కృష్ణమూర్తి, ఎంపీటీసీ శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.