డొమెస్టిక్ ప్రయాణికుల లగేజీ అనుమతిలో కోత విధిస్తూ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. గతంలో ఎకనామీ కంఫర్ట్ ప్రయాణికులకు 20 కేజీల లగేజీతో ప్రయాణించేందుకు అనుమతి ఉండగా.. ఇప్పుడు 15 కిలోలకు తగ్గించింది. ఎకనామీ కంఫర్ట్ ప్లస్ క్లాస్ ప్రయాణికులకు ఇంతకుముందు 25 కిలోలకు అనుమతి ఉండగా.. ఇప్పుడు 15 కిలోలకు తగ్గించింది. ఈ నిర్ణయం నిన్నటి నుంచి అమలులోకి వచ్చిందని ఎయిర్ ఇండియా పేర్కొన్నది.