పద్మశ్రీ మొగులయ్య మాట్లాడుతూ 'ఇంట్లో పూట గడవడం కోసం తాను పని కోసం చాలాచోట్ల ప్రయత్నించానని, అయినా తనకు గౌరవప్రదమైన పని ఎక్కడా దొరకలేదు అన్నారు. తన ప్రతిభను గుర్తించి కొంతమంది తనకు ఆర్థికంగా సహాయం చేసినా, తనకు ఉపాధి మాత్రం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తనకు కోటి రూపాయలు గ్రాంటుగా ఇచ్చిందని, అయితే ఆ డబ్బు తన పిల్లల పెళ్ళి కోసం ఉపయోగించానని ఆయన తెలిపారు.'