తాడూరు మండలం సిర్సవాడ సమీపంలోని దుందుభీ వాగులో సిర్బవాడ- ఊర్కొండ మండలం మాదారం ప్రధాన రహదారి కాజ్వే పూర్తిగా దెబ్బతింది. కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు క్రమంగా ధ్వసమైంది. గుంతలు ఏర్పడి ప్రమాదక రంగా మారడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయ్యాయి. రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవడంతోపాటు వంతెన నిర్మాణంతో శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.