చిరంజీవితో అల్లు అర్జున్
మెగాస్టార్ చిరంజీవిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. HYD జూబ్లీహిల్స్‌లోని చిరు నివాసానికి బన్నీ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరును కలిశారు. తొక్కిసలాట ఘటన, అరెస్ట్ పరిణామాలపై ఆయనతో బన్నీ చర్చించినట్లు సమాచారం. కాగా నిన్న జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ను పలువురు సినీ ప్రముఖులు కలుస్తున్నారు.